epaper
Sunday, March 1, 2026
epaper

బుద్ధవనం చేరుకున్న దమ్మ పాదయాత్ర

కలం, నాగార్జునసాగర్ : గౌతమ బుద్ధుని శాంతి సందేశంతో సాగుతున్న మూడో దమ్మయాత్ర ఆదివారం సాయంత్రానికి నాగార్జున సాగర్ లోని (Nagarjuna Sagar) బుద్ధవనం చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మానస స్వర్ణ, వైస్ చైర్మన్ రాజా ప్రసాదులతో కలిసి బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య దమ్మయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. బంజారా నృత్యాలతో, కోలాటాలతో, ఒగ్గు కళాకారుల నృత్యాలతో, స్థానికులు, బౌద్ధ అభిమానులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. అనంతరం 403 కిలోమీటర్లు పాదయాత్రతో వచ్చిన థాయిలాండ్, భారతీయ బౌద్ధ భిక్షువులుకు అశోక ధర్మ చక్రం వద్ద పాదాలను కడిగారు.

బుద్ధ ధాతువులను బుద్ధవనం ప్రధాన ద్వారం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి మహస్థూపంలోని ధ్యాన మందిరంలో సందర్శకుల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ సంఘ థాయిలాండ్ అధ్యక్షులు పర సంగ్ సక్ కోవిడో ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భిక్షులతో సుమారు 403 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బుద్ధవనం చేరుకున్నారన్నారు. థాయిలాండ్ రాజకుటుంబం నుండి మహాథాయ్ ఈ దమ్మయాత్రకు సహకారం అందించారని తెలిపారు. గగన్ మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గగన్ మాలిక్ దమ్మయాత్రకు ప్రారంభం నుండి ముందుండి నడిపించారని లక్ష్మయ్య వివరించారు.

అక్షయ ఫౌండేషన్ అధ్యక్షులు సిద్ధార్థ హిట్టెంబరి, లతరాజా ఫౌండేషన్ అధ్యక్షులు కేకే రాజా దమ్మ యాత్రను విజయవంతం చేసేందుకు భాగస్వాములు అయ్యారని వివరించారు. బిఎస్ ఐ తెలంగాణ అధ్యక్షులు పరంధాములు ఆధ్వర్యంలో బిఎస్ ఐ సభ్యులు తెలంగాణలో కొనసాగిన దమ్మయాత్రకు సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ వనం ఆర్ట్స్, ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, స్థానిక సీఐ శ్రీను నాయక్, ఎస్సై ముత్తయ్య, స్థానిక కౌన్సిలర్లు, బౌద్ధాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!