కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు, అనంతరపురం జిల్లాల్లోని వింజమూరు, బొమ్మనహల్ ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి నేతల తీరు ప్రభుత్వ దురంకారానికి నిదర్శనం అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ చేశారన్నారు. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబు.. రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలన్నారు.
ఒక చిన్న ఎంపీపీ ఉప ఎన్నికల్లో (MPP By Elections) కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేస్తారా?..ఇంత దిగజారుడు తనమా? అని జగన్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ పార్టీ ఎంపీటీసీలను ఓటేయకుండా అడ్డుకున్నారని.. వారిపై దాడులు చేయడంతో పాటు కిడ్నాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బలప్రదర్శన వేదికగా చంద్రబాబు మార్చాడని జగన్ మండిపడ్డారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేయడం, వారిపై బహిరంగంగా దాడి చేయడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగపర్చుకోవడం కూటమి ప్రభుత్వానికి సర్వసాధారణమైపోయింద ని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం అధికార దుర్వినియోగం ఎంత చేస్తోందో, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మారిందన్న విషయాలను తేటతెల్లం చేస్తోందని జగన్ అన్నారు.

Read Also: చంద్రబాబుతో ధోనీ మీటింగ్.. ఎందుకంటే..?
Follow Us On: Youtube


