కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం(Tragic Road Accident) చోటుచేసుకుంది. కమలాపూర్ మండలం లక్ష్మిపూర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. శనిగరం గ్రామానికి చెందిన వట్టెం నాగరాజు (20), బండి వినయ్ (18) తమ స్నేహితుడు మృతి చెందడంతో అతని అంత్యక్రియలకు హాజరై బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మిపూర్ వద్ద బైక్ అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

