ఇండియాకు షాక్.. 45 రన్స్‌కే రెండు వికెట్లు

కలం, డెస్క్ : వెస్టిండీస్‌తో (India Vs West Indies) జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. 5 ఓవర్లకు 45 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది ఇండియా. ఓపెనర్ అభిషేక్ శర్మ 10 బంతుల్లో 10 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్.. కొన్ని బౌండ్రీలు చేసినప్పటికీ హోల్డర్ బౌలింగ్లో క్యాచ్‌ ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 6 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. 196 పరుగులు భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు ఇది భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి. విండీస్ బౌలర్లలో హోసెన్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. హోల్డర్ ఒక ఓవర్ బౌలింగ్ వేసి ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో సంజుశాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. వీరిలో సంజూ 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>