అమెరికాను చూసి మోదీ భయపడుతున్నారని రాహుల్(Rahul Gandhi) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొనుగోలు ఆపేస్తామని, అమెరికా నుంచే కొంటామని మోదీ తనకు మాట ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) చేసిన వ్యాఖ్యలను రాహుల్ పునరుద్ఘాటించారు. ట్రంప్ చూసి భయపడ్డారు కాబట్టే.. మోదీ(PM Modi) సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగానే ప్రధాని మోదీని రాహుల్ ఐదు అంశాలు పంచుకున్నారు..
1. రష్యా(Russia) నుంచి భారత్ చమురు కొనదని ట్రంప్ తనంతట తానే నిర్ణయించుకుని ప్రకటించుకోవడానికి అనుమతించారు.
2. పదేపదే తిరస్కరణలు ఎదురవుతున్నా మనం మాత్రం అభినందిస్తూ సందేశాలు పంపుతున్నాం
3. ఈజిప్ట్‌లోని షర్మ్-ఎల్ షేక్‌లో సోమవారం గాజా శాంతి ఒప్పందం జరిగింది. దానికి మోదీ గైర్హాజరయ్యారు.
4. ఆపరేషన్ సింధూర్ గురించి ట్రంప్ పదేపదే చేస్తున్న ప్రకటనలను తిరస్కరించడం లేదు. అని రాహుల్(Rahul Gandhi) పేర్కొన్నారు.
Read Also: కొండా సురేఖ ఇంటి నుంచి భద్రత తొలగింపు.. సీఎం ఆదేశమేనా..

