తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ భూములను వేలం వేయడానికి రెడీ అయింది. గతంలో హెచ్‌సీయూ(HCU) భూముల విషయంలో ఎదురుదెబ్బ తగిలినా తన పంథాను మార్చుకోవడం లేదు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్(Raidurg) పరిధిలోని నాలెడ్జ్ సిటీ(Knowledge City)లో ఉన్న 4,718.22 చదరపు గజాల ప్రభుత్వ భూమిని వేలం వేసేందుకు టీజీఐఐసీ(TGIIC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఒక్క గజానికి రూ.3,10,000 రిజర్వ్ ధర నిర్ధారించింది. నవంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ–వేలం జరగనున్నట్లు తెలిపింది.
Read Also: కొండా సురేఖ ఇంటి నుంచి భద్రత తొలగింపు.. సీఎం ఆదేశమేనా..

