సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సొంత నియోజకవర్గం కొడంగల్(Kodangal)లో ప్రజలు రోడ్డెక్కారు. రాస్తారోకో నిర్వహించారు. నియోజకవర్గంలో మంజూరయిన మెడికల్, వెటర్నరీ కాలేజీలతో పాటు ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఇటీవల లగచర్లకు గ్రామానికి తరలించారు. దీంతో పర్సాపూర్ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి మంజూరయిన వాటిని వేరే గ్రామానికి ఎలా మారుస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. మెడికల్, వెటర్నరీ కాలేజీలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను తమ గ్రామంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ముందు చెప్పిన విధంగానే వాటిని యథావిథిగా చెప్పిన ప్రాంతాల్లో నిర్మించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగానే వారు రాస్తారోకో నిర్వహించి తరలింపు నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు.
Read Also: కొండా సురేఖ ఇంటి నుంచి భద్రత తొలగింపు.. సీఎం ఆదేశమేనా..

