epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

హుస్నాబాద్ ను టచ్ చేస్తే ఉద్యమమే : మాజీ ఎమ్మెల్యే

కలం, మెదక్ బ్యూరో : జిల్లాల పునర్విభజన పేరుతో హుస్నాబాద్ (Husnabad)ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ (Satish Kumar) ప్రభుత్వంను హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో తనది ఏమీ నడవడం లేదని, కరీంనగర్ జిల్లాలో కలుపుకుంటే తనది నడుస్తుందేమోనని ఆశతో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో కలిపే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

హుస్నాబాద్ ప్రజలందరూ సిద్దిపేట జిల్లాలో ఉండడం పట్ల సంతోషపడుతున్నరన్నారని, ఎవరి లాభం కోసం హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలుపుదామంటున్నారని సతీష్ కుమార్ ప్రశ్నించారు. మంత్రి దగ్గర ఉన్న ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలుపమని మాట్లాడడం లేదన్నారు.

మంత్రి అయ్యి ఉండికూడా హుస్నాబాద్ (Husnabad)కు ఇంతవరకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే సతీష్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఇంటింటికి కరపత్రం ఇస్తూ బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు సతీష్. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also: కాంగ్రెస్ మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు : కేటీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>