కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా ఏమీ లేదని.. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆడిస్తున్న ఆటలో భాగమే ఇదంతా అంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ మంత్రులు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని జర్నలిస్టులకు చెబితే.. మీడియాల్లో వార్తలు వస్తున్నాయని.. ఆ వార్తలను ప్రభుత్వం ఎందుకు ఖండించట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అనేది ఇప్పుడు కొత్త కాదు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచే చేస్తున్నారు.
దేశ భద్రత కోసం కేంద్ర హోం శాఖ చేస్తుంది. ఇటు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చేస్తుంది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా పోలీస్ అధికారులు చేశారేమో. అది మంత్రులకు అస్సలు తెలియదు. రాష్ట్ర ప్రజల రక్షణ, శాంతి భద్రతల కోసం అధికారులు, పోలీసులు ఫోన్లు ట్యాప్ చేస్తుంటారు. ఆ విషయం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన శివధర్ రెడ్డి, అప్పటి డీజీపీలు మహేందర్ రెడ్డి, జితేందర్ కు తెలుస్తుంది. మాకు ఆ విషయం తెలియదు’ అంటూ కేటీఆర్ తెలిపారు.
ఇప్పుడు కాంగ్రెస్ మంత్రుల ఫోన్లను, బీఆర్ ఎస్ నేతల ఫోన్లను ట్యాప్ చేయట్లేదని ఏ అధికారి అయినా చెప్పగలుగుతారా అంటూ ప్రశ్నించారు కేటీఆర. ‘రేపు సిట్ విచారణలో నా ఫోన్ ను ట్యాప్ చేయట్లేదా అని అడుగుతా.. ఎవరైనా సమాధానం చెబుతారా. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కూడా వేల మంది ఫోన్లను ట్యాప్ చేస్తోంది. అదంతా భద్రతలో భాగంగా చేస్తుంటారు. ఇందులో కొత్తదేం లేదు. రేపు నన్ను పిలిచి టైంపాస్ ప్రశ్నలు వేస్తారు. అంతకు మించి ఏమీ ఉండదు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ లో భాగమే’ అంటూ చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR).
Read Also: ఏపీలో క్రెడిట్ చోరీ రాజకీయం.. ఎవరికి లాభం..?
Follow Us On: Instagram


