Mobile Popup Ad
Mobile Popup Ad

సవాల్‌ను స్వీకరించే దమ్ముందా లేదా కేటీఆర్?: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇండ్లే రిఫరెండమని… సవాల్ ను స్వీకరించే దమ్ముందా లేదా కేటీఆర్? అంటూ ప్రశ్నించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడే దమ్ము లేకనే హైదరాబాద్ లో ఇళ్ల మీద పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇళ్లపై సవాల్ చేస్తే… ఆ సవాల్ ను స్వీకరించే ధైర్యం లేక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. చేతల ప్రభుత్వం కాబట్టే.. తొలి రెండున్నర సంవత్సరాలలోనే గ్రామాల్లో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Housing Scheme) నిర్మాణాలు ప్రారంభించామని చెప్పారు. జూన్ 1న మరో 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించబోతున్నామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో తొలి విడతలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని వివరించారు.

మాటలు తప్ప, చేతలు ఎక్కడైనా ఉన్నాయా డ్రామారావు?

అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి ఢిల్లీలో బీజేపీ నేతల ముందు మోకరిల్లింది బీఆర్ఎస్ (BRS) వాళ్ళు అని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, కవిత సైతం ప్రస్తావించారని చెప్పారు. దళితులను సీఎం చేస్తా అన్న హామీ నుంచి నుండి డబుల్ బెడ్ రూం ఇళ్ల వరకు.. అన్నీ మాటలు తప్ప, చేతలు ఎక్కడైనా ఉన్నాయా డ్రామారావు? అని ఎద్దేవా చేశారు. అవినీతి, అక్రమాల గురించి కేటీఆర్ (KTR) మాట్లాడితే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని విమర్శించారు. బీఆర్ఎస్ ధరణి దందాలు, బినామీల బాగోతాలు, రియల్ ఎస్టేట్ అక్రమాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోటీకి దూరంగా ఉంటారా కేటీఆర్?

పదేళ్ల బీఆర్ఎస్ హాయంలో గ్రామాల్లో కేసీఆర్ (KCR) కట్టిన ఇళ్ల కంటే, కేవలం రెండున్నర సంవత్సరాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువ ఇండ్లు నిర్మించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఇళ్ల నిర్మాణంపై మరొక్కసారి సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో కట్టిన ఇళ్ల కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని.. కాంగ్రెస్ ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే పోటీకి దూరంగా ఉంటారా కేటీఆర్? దమ్ముంటే సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. 2014కు ముందు బీఆర్ఎస్ ఆర్థిక పరిస్థితి ఏమిటి? పదేండ్లు అధికారంలో ఉండి విచ్చలవిడిగా ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు అని విమర్శించారు.

ఒక్కో గృహం 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానం..

గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టిస్తేనే ఓట్లు అడగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామని ఛాలెంజ్ చేసిన మంత్రికి ఆ మాట నిలబెట్టుకునే దమ్ముందా? అని ప్రశ్నించారు. దమ్ముంటే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. తాము కట్టిన ఒక్కో గృహం 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానమన్న కేటీఆర్.. చిత్తశుద్ధి, సత్తా ఉంటే అంతకు మించి హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం గృహాలను కట్టాలని సవాల్ చేశారు.

Read Also: పరీక్షల నిర్వహణలో లోపాలు.. NTAపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>