కలం, ఖమ్మం బ్యూరో : భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని కొనియాడారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండడం గర్వకారణమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: కర్తవ్య పథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి
Follow Us On: Sharechat


