Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్‌లో అక్రమ మొరం తవ్వకాలపై మెరుపుదాడి.. భారీ వాహనాలు సీజ్

కలం, నిజామాబాద్ బ్యూరో: పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా అక్రమ ఇసుక, మొరం రవాణాకు చెక్ పడటం లేదు. అక్రమార్కులు నిబంధనలను బేఖతారు చేస్తూ అక్రమ మొరం తవ్వకాలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో అక్రమ మొరం తవ్వకాలపై మెరుపుదాడి నిర్వహించారు. నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుగుట్ట వెనుక భాగంలో అక్రమంగా మొరం (Gravel) తవ్వకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. తవ్వకాలకు ఉపయోగిస్తున్న 3 టిప్పర్లు, 2 JCB యంత్రాలు 1 ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చర్యల కోసం నందిపేట్ పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు. అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు.

Read Also: విజిలెన్స్ అధికారుల ముసుగులో మోసం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>