చెన్నైలో టీవీ నటి సుభాషిణి ఆత్మహత్య..

కలం, వెబ్ డెస్క్ : చెన్నై నగరంలోని పోరూరు (Porur) లో టీవీ నటి సుభాషిణి (Actress Subhashini) (36) ఆత్మహత్య ఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీలంకకు చెందిన సుభాషిణి, తన భర్త పిప్పిన్‌తో కలిసి బెంగళూరులో నివసిస్తూ ఉండేది. అయితే టీవీ సీరియల్స్, సినిమా షూటింగ్‌ల కారణంగా చెన్నైలోని పోరూరులోని ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటూ నటన కొనసాగిస్తుంది.

సన్ టీవీలో ప్రసారమవుతున్న “కయల్” సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుభాషిణి (Actress Subhashini), సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండేది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా, ఆమె తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన సమాచారం అందుకున్న పోరూరు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఘటనకు ముందు రాత్రి ఆమె తన భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న సమయంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం తీవ్ర మనస్థాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్నేహితులు చెబుతున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ విషాద ఘటనతో సినీ పరిశ్రమతో పాటు ఆమె అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Read Also: నేను విదేశీ ప్లేయర్‌నా?: వైరల్ జోక్స్‌పై విరాట్ కోహ్లీ ఫన్నీ రియాక్షన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>