మోదీ రోజ్‌గార్ మేళా ధమాకా: ఒకేసారి 51 వేల మందికి నియామక పత్రాలు!

కలం, వెబ్‌ డెస్క్ : దేశంలోని యువతకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 19వ రోజ్‌గార్ మేళాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా ఎంపికైన యువతకు 51 వేలకు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన యువతను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

19వ రోజ్‌గార్ మేళాను దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. భారత దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన కొత్త అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో చేరనున్నారు. ఇందులో ప్రధానంగా రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి కీలక శాఖలలో వీరు విధుల్లో చేరనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>