డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ లారీ డ్రైవర్‌.. 20 రోజుల జైలు శిక్ష

కలం, నిర్మల్ : మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ లారీ డ్రైవర్‌కు నిర్మల్ ( Nirmal)  న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు సోన్ ఎస్సై కే. గోపి తెలిపారు. ఇటీవల గంజాల్ టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి వి. నర్సయ్య 20 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై హెచ్చరించారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>