ప్రభుత్వ విద్యార్థులకు ‘స్వచ్ఛంద’ చేయూత!

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి (Jakranpally) మండలంలోని బాలనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో కల్కి గ్రిట్ ఫోర్స్ (KGF) స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్యార్థులకు తెలుగు ఆంగ్ల చేతి వ్రాత పుస్తకాలను అందజేశారు. పాఠశాలలో ప్రతి విద్యార్థికి వీటిని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ కొమిరే రాజు హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఇలాంటి సంస్థలు చేయూతనిస్తే వారి బతుకు బంగారు మయమవుతుందని తెలియజేశారు.

KGF అధ్యక్షుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి గ్రామాల్లో ఇంకా చాలా అవగాహన కార్యక్రమాలు ముందు ముందు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీమతి మాధురి, మహేష్, నాగేందర్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు సునీత సుజాత విట్టల్ రావు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>