Mobile Popup Ad
Mobile Popup Ad

పవర్‌లిఫ్టర్ టూ బాలీవుడ్ హీరోగా సాగర్ తుగ్నైత్ జర్నీ

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీకి చెందిన పవర్‌లిఫ్టర్ సాగర్ తుగ్నైత్ (Sagar Tugnait) ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రామిసింగ్ యాక్టర్‌గా దూసుకుపోతున్నారు. క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయన, ప్రస్తుతం సినిమాలలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. పుల్కిత్ సామ్రాట్, జన్నత్ జుబేర్ ప్రధాన పాత్రలలో  తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్ ‘గ్లోరీ’లో సాగర్ నటిస్తున్నారు. ఇందులో తన అథ్లెటిక్ బాడీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్ డాక్టర్ సోమ్ తుగ్నైత్ కుమారుడైన సాగర్, ఢిల్లీలోని ప్రముఖ ‘మెటల్ జిమ్’ నిర్వహణలోనూ భాగస్వామిగా ఉన్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫిట్‌నెస్ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

సాగర్ తుగ్నైత్ 2016లో సుబ్రతో క్లాసిక్ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచారు. 2017 వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్ రా 125 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. అలాగే బెంచ్ ప్రెస్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు. 2021 ఒలింపియా అమేచ్యూర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీలలో  సెకండ్ రన్నరప్‌గా నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు. క్రీడల తర్వాత నటన వైపు అడుగులు వేసిన సాగర్, అజయ్ దేవగన్ సినిమా ‘ఔరోన్ మే కహా దమ్ థా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సమంత నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’, రానా దగ్గుబాటి సిరీస్ ‘రానా నాయుడు’ వంటి ప్రాజెక్టులతో గుర్తింపు పొందారు.

తాజాగా ఆయన ‘చోర్ నికల్ కే భాగా 2’ సినిమాలోనూ నటిస్తున్నారు. క్రీడలు, నటన రెండింటినీ బ్యాలెన్స్ చేయడంపై స్పందించిన సాగర్, ఫిట్‌నెస్ తన జీవితంలో ఎప్పటికీ భాగమేనని చెప్పారు. ఒకే గుర్తింపుకే పరిమితం కావడం తనకు ఇష్టం లేదని, నటన తనకు కొత్త సృజనాత్మక వేదికను ఇచ్చిందని తెలిపారు. జిమ్ నుంచి ఫిల్మ్ సెట్స్ వరకు సాగిన ఆయన ప్రయాణం.. ఫిట్‌నెస్, సినిమా రంగాల కలయికకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>