Mobile Popup Ad
Mobile Popup Ad

కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. అయిదు గంటల పాటు సాగిన ఈ భేటీలో దేశానికి సంబంధించిన అనేక కీలక అంశాలను వివరించి, వాటిపై ఎలా వ్యవహరించాలో కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి వారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశానికి కేవలం కేబినెట్ మంత్రులే హాజరవుతుంటారు. కానీ, ఈ సమావేశానికి కేబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రులు హాజరయ్యారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక.. ఇలా పూర్తి స్థాయి కేబినెట్ సమావేశం నిర్వహించడం ఇది రెండోసారి.

పశ్చిమాసియా యుద్ధంపైనే కీలక చర్చ..

కేంద్ర మంత్రులతో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ పశ్చిమాసియా యుద్ధం గురించే ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. యుద్ధం వలన భారత్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో.. కేంద్ర మంత్రులకు వివరించారు. అదే సమయంలో, ప్రజలకు తక్కువ ఇబ్బంది కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో, వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుపైనా చర్చించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>