Mobile Popup Ad
Mobile Popup Ad

బీస్ట్ మోడ్‌లో మెగాస్టార్.. భారీ స్టంట్స్‌తో మాస్ ట్రీట్

కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) , స్టార్ డైరెక్టర్ బాబీ (Bobby) కాంబినేషన్‌లో మరో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘Mega158’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలోని భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని అతిపెద్ద యాక్షన్ ఎపిసోడ్స్‌లో  ఒకటి ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను (Action Sequence) భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ సన్నివేశంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పలు సాహసోపేతమైన స్టంట్స్ చేస్తూ అభిమానులను అలరించనున్నారు. తనదైన మాస్ స్టైల్, ఎనర్జీతో చిరంజీవి మరోసారి ప్రేక్షకులకు ప్రత్యేకమైన యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. తరాలు మారినా తన క్రేజ్, మాస్ ఇమేజ్‌ను కొనసాగిస్తూ మెగాస్టార్ ఈ చిత్రంతో ఫ్యాన్స్‌లో  మరోసారి సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న #Mega158పై అభిమానులలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>