కలం, వెబ్ డెస్క్: ఈ నెల 10వ తేదీన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో సీఎం (CM Revanth Reddy) రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సభా ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం తుమ్మల పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే ఈ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
గత నెల 30న ఖమ్మంలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షం కారణంగా రద్దైంది. దీంతో వాయిదా పడిన సభను ఈ నెల 10న నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ముఖ్యమంత్రి (CM Revanth Reddy) సభకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, ఇతర ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.

