కలం, వెబ్ డెస్క్: శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసే దొంగగా మారాడు. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) హమీర్‌పూర్‌లో ట్రక్కు డ్రైవర్‌ని లిఫ్ట్ అడిగిన ఎస్ఐ రూ. 20,000 దొంగిలించాడు. హమీర్‌పూర్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎస్ఐ ట్రక్ డ్రైవర్‌ను లిఫ్ట్ అడగగా, అతడు మానవత్వంతో ఎక్కించుకున్నాడు. ఎస్ఐ ట్రక్ దిగిన కాసేపటికి తన వద్ద ఉన్న రూ. 20,000 నగదు మాయమైనట్లు డ్రైవర్ గుర్తించాడు.
ఎస్ఐపైనే అనుమానంతో డ్రైవర్ తన వాహనాన్ని వెనక్కి తిప్పి, దాదాపు 13 కిలోమీటర్ల మేర సినిమా ఫక్కీలో వెంబడించి ఎస్ఐ కారును అడ్డుకున్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన తీవ్ర ఘర్షణకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఆ తనిఖీల్లో పోయిన డబ్బును డ్రైవర్ రికవరీ చేసుకోవడం గమనార్హం. ఈ దొంగతనం ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో హమీర్‌పూర్ పోలీసులు ఎస్ఐపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. బాధితుడి నుంచి ఫిర్యాదు ఆధారంగా ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేశారు.

