కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా(Raila Odinga) మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. రైలా మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. ‘‘నా స్నేహితుడు, కెన్యా మాజీ ప్రధాని ఒడింగా మరణం నన్ను కలచివేసింది. అతడు ఇండియాకు ఎంతో ఆప్తమిత్రుడు. నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే అతనితో స్నేహం చేసే అవకాశం లభించింది. ఆ స్నేహం ఏళ్ల తరబడి కొనసాగింది. ఇండియాతో రైలాకు(Raila Odinga) చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మన సంప్రదాయాలు, విలువలు, పురాతన విజ్ఞానం అనేవి ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి. భారత్-కెన్యా మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన తీసుకున్న చర్యలు దీనిని స్పష్టం చేస్తాయి’’ అని మోదీ పేర్కొన్నారు.
Read Also: ఇలాంటి పాస్‌వర్డ్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!

