పాస్‌వర్డ్(Passwords).. వీటిని చాలా గోప్యంగా ఉంచుకోవాలి. ఈ విషయాన్ని ప్రతి యాప్, వెబ్‌సైట్, ప్లాట్ ఫార్మ్స్ చెప్తూనే ఉంటాయి. అంతేకాకుండా పాస్‌వర్డ్‌కు పకడ్బందీగా పెట్టాలని, ఈజీగా ఉంచొద్దని కూడా హెచ్చరిస్తాయి. పాస్‌వర్డ్‌లో గుర్తులు, అంకెలను, పెద్ద అక్షరాలను ఉంచాలని సూచించినా కూడా చాలా సాధారణంగా చూస్తుంటాం. కానీ, పాస్‌వర్డ్‌లను ఇంత పకడ్బందీగా ఉంచుతున్నా.. హ్యాకింగ్ అనేది భారీగా జరుగుతోంది. అసలు మనం అంత పకడ్బందీగా పెట్టిన, మనకు మాత్రమే తెలిసిన పాస్‌వర్డ్‌లను అసలు అంత ఈజీగా ఎలా క్రాక్ చేస్తున్నారు? అన్న అనుమానం మీకెప్పుడైనా అనిపించింది. అయితే నిపుణులు మాత్రం ఈ హ్యాకింగ్‌లకు యూజర్లే కారణమని అంటున్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా.. చాలా మంది సులభమైన పాస్‌వర్డ్‌లను పెడుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా అయ్యే హ్యాకింగ్‌లలో చాలా వరకు ఈ ఈజీ పాస్‌వర్డ్‌ల వల్లే జరుగుతున్నాయని చెప్తున్నారు.
పాస్‌వర్డ్‌లను గెస్ చేసే విషయంలో హ్యాకర్లు కొన్ని పద్దతులను పాటిస్తారు. అలా వాళ్లు పాటించే బేసిక్ పద్దతుల ద్వారానే సుమారు 80శాతం పాస్‌వర్డ్‌లు ఓపెన్ అవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. నిపుణులు చెప్తున్న దాని ప్రకారం.. ‘123456, admin, password’ ఇలాంటి ఈజీ పాస్‌వర్డ్‌లు పెడుతున్నారట. అంతేకాకుండా మరికొందరు ఒకే నెంబరును రిపీట్ చేయడం, తమ పుట్టినరోజులు, తమ పేర్లు, తమకు ఇష్టమైన వారి పేర్లను పెడుతున్నారని అధికారులు గుర్తించారు. వీటిని గెస్ చేయడం యూజర్ పేరు, admin, వరుస నెంబర్లు, ఒకే నెంబర్ పలుసార్లు రిపీట్ చేయడం వంటివి హ్యాకర్లు వినియోగించే పద్దతుల్లో ఈజీగా తెలిసిపోతుందంటున్నారు.
సులభమైన నంబర్ సీక్వెన్స్: “123456” లేదా “123456789” వంటివి.
సాధారణ పదాలు: “password”, “admin”, “qwerty” వంటివి.
వ్యక్తిగత సమాచారం: పుట్టిన తేదీలు, పేర్లు, లేదా “yourname123” వంటివి.
సాధారణ పదబంధాలు: “111111” లేదా “000000” వంటివి.
ఈ రకమైన పాస్‌వర్డ్‌లను(Passwords) వాడటం వల్ల మీ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సురక్షితంగా ఉండటానికి, మరింత సంక్లిష్టమైన మరియు ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం చాలా ముఖ్యం.
పాస్‌వర్డ్‌ను క్లిష్టంగా పెట్టుకోవాలి. పాస్‌వర్డ్‌లో క్యాపిటల్ లెటర్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగని అన్నీ క్యాపిటల్ లెటర్స్ పెట్టినా ప్రమాదమే. వాటితో పాటు గుర్తులను కూడా వినియోగించడం మంచింది. అలా చేయడం ద్వారా అన్నిటి కాంబినేషన్‌ను గెస్ చేయడం హ్యాకర్స్‌కు కుదరదు కాబట్టి.. మీరు షేర్ చేసుకునే వరకు, పాస్‌వర్డ్‌లను అందుబాటులో ఉంచే వరకు హ్యాకర్ మీ పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేయడం చాలా వరకు జరగదని నిపుణులు చెప్తున్నారు.
Read Also: బాత్రూమ్‌లో మొబైల్ వాడితే పైల్స్ వస్తాయా..?

