బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు ఇచ్చిన స్టే నేపథ్యంలో అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ చేయాలని బీసీ సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఆర్ కృష్ణయ్య(R Krishnaiah) ఆధ్వర్యంలో బీసీ సంఘాలు చేపట్టిన ఈ బంద్‌కు అన్ని పార్టీల మద్దతును కోరుతున్నాయి బీసీ సంఘాలు. ఈ క్రమంలోనే బుధవారం బీఆర్ఎస్(BRS) నాయకులను కలిశారు. దీంతో తెలంగాణ భవన్‌లో బీసీ జేఏసీ నేతలతో కలిసి బీఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బంద్‌కు బీఆర్ఎస్ తన పూర్తి మద్దతు తెలిపింది. తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్లి సాధించుకుందామని, ఈ అంశంలో బీసీలకు అడుగడునా బీఆర్ఎస్(BRS) మద్దతుగా నిలుస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వడంపై కేటీఆర్ సెటైర్లు వేశారు.
‘‘అసలు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇంత తలనొప్పులు ఎందుకు ఉంటాయి. కేంద్రంలో బిల్లును ఆపింది వాళ్లే కదా. ఇండియా, ఎన్‌డీఏ కూటములు తల్చుకుంటే టీ తాగినంత సేపట్లో బీసీ బిల్లుకు ఆమోదం పడుతుంది. రిజర్వేషన్లు వచ్చేస్తాయి. పార్లమెంట్‌లో బిల్ పెడితే అది పాస్ అవడం ఖాయం. అందులో సందేహం లేదు. కానీ బీజేపీ నేతలు కావాలనే దానిని అడ్డుకుంటున్నారు’’ అని కేటీఆర్ విమర్శించారు.
Read Also: పెళ్లి వేస్ట్.. డేటింగే బెస్ట్ అంటున్న ఫ్లోరాసైనీ

