epaper
Tuesday, November 18, 2025
epaper

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కీలక విచారణ

బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశంపై సుప్రీంకోర్టులో గురువారం కీలక విచారణ జరగనుంది. రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీఓపై హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ (SLP) దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారించనుంది. హైకోర్టు విధించిన స్టేను రద్దు చేయించుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుంది? హైకోర్టు స్టేను సమర్థిస్తుందా? రద్దు చేస్తుందా? అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలో రిజర్వేషన్ల విధానంపై కీలక ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంటున్నారు.

Read Also: కెన్యా మాజీ ప్రధాని మృతి.. సంతాపం తెలిపిన మోదీ

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>