వికసిత్ భారత్ సాధించడంలో రైతులు పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు. భారత్‌ను స్వయంప్రతిపత్తి దేశంగా మార్చగల సత్తా రైతులకు ఉందన్నారు. విదేశీ దిగుమతులపై భారత్ ఆధారపడకుండా ఉండాలంటే రైతులు తమ సాగులో చిన్న మార్పులు తీసుకురావాలన్నారు. కేవలం వరి, గోధమ లాంటి పంటలే కాకుండా ప్రోటీన్ అధికంగా ఉండే పప్పులకు సంబంధించిన పంటల సాగును పెంచాలని సూచించారు. వాటిని ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను పండించాలని చెప్పారు. దేశంలో పంటల ఉత్పత్తికి అయ్యే ఖర్చులు తగ్గించి, రైతుల ఆదాయం పెంచే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పదేళ్లలో వ్యవసాయ రంగంలో రూ.5కోట్ల సబ్సిడీలు ఇస్తే తమ ప్రభుత్వం పదేళ్లలో మొత్తం రూ.13 కోట్లకుపైగా సబ్సిడీలను అందించిందని వివరించారు. భారత్.. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే అన్ని రంగాల్లో నిరంతరం కొత్త మార్పులు రావాలని అన్నారు మోదీ(PM Modi). అందులో భాగంగానే ‘ధన్ ధాన్య కృషి’ యోజన పథకాన్ని తీసుకొచ్చనిట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు దేశంలోని 100కు పైగా జిల్లాలను వెనకబడిన జిల్లాలుగా ప్రకటించి.. ఆపై వాటిని పూర్తిగా మర్చిపోయాయన్నారు. తమ ప్రభుత్వ మాత్రం ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయని, వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్ట్‌లను అమలు చేస్తోందని అన్నారు.

