బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్(Amitabh Bachchan) తన 83వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) విషెస్ చెప్పాడు. ప్రభాస్ విషెస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘‘మీకు దగ్గర ఉండి మీ వర్క్‌ను చూడటం, మీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నారు’’ అని తెలిపారు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ కలిసి ‘కల్కి-2898’లో నటించారు. ఆ సినిమాలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పట్టాలపై ఉంది.
‘కల్కి-2’లో వీరిద్దరి మధ్య ఉండే సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని సినీ సర్కిల్స్‌లో టాక్. ప్రభాస్(Prabhas), అమిత్‌కు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దీపిక పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. ఆమె ప్లేస్ భర్తీ చేయడంపై మూవీ టీమ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Read Also: ఆ సీన్స్‌ను ఎంకరేజ్ చేసే మెచ్యూరిటీ రావాలి : జాన్వీ కపూర్

