epaper
Monday, November 17, 2025
epaper

బరువు తగ్గాలా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

Weight Loss Journey | ఊబకాయం.. ప్రస్తుత యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంశం. వీరిలో చాలా మంది ఏం చేసినా బరువు తగ్గినట్లే తగ్గి వెంటనే పెరిగిపోతున్నామని బాధపడుతుంటారు. డాక్టర్లు, జిమ్‌లు అని వేలకు వేల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం ఆశించినంతగా ఉండదు. అందుకు కారణం వారికి పోషకాహారం గురించి సరైన సమాచారం లేకపోవడమే అని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలని అనుకుంటున్న వారంతా కూడా కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలని చెప్తున్నారు. ఊబకాయం అనేక వ్యాధులకు బీజంగా మారుతుంది. అందుకే అధిక బరువు ఉంటే దానిని తగ్గించడానికి వెంటనే చర్యలు చేపట్టడం ఉత్తమం అని అంటున్నారు వైద్యులు. బరువు తగ్గడం అంటే ఆహారం మానేయడం కాదని, సమతుల్యమైన ఆహారం తీసుకోవడమని వివరిస్తున్నారు. బరువు తగ్గాలంటే డైట్ ప్లాన్‌లో సరైన ఆహారం కచ్ఛితంగా ఉండాలని, అలా లేకపోతే ఫలితం ఉండదని అంటున్నారు.

బరువు తగ్గాలి అనుకునేవారు కొన్ని ఆహారాలను పూర్తిగా దూరం పెట్టాలి. అలాగని ఆకలితో ఉండకూడదు. ఇది శరీరంలోని శక్తిని ప్రభావితం చేస్తుంది. బలహీనతలకు దారితీస్తుంది. అసలు బరువు తగ్గాలని అనుకునే వారు ఏ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలంటే..

Weight Loss Journey లో ఇవి అస్సలు తినొద్దు..

పెరిగిన బరువును తగ్గించుకోవాలి అంటే కీటో డైట్, ఆట్కిన్స్ డైట్ అస్సలే పాటించకూడదని అధ్యయనాలు చెప్తున్నాయి. చాలా మంది బరువు తగ్గాలి అనగానే వీటి బాట పడుతున్నారని, అది ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు. అంతేకాకుండా ముందు అసలు అవేంటి? అనేది తెలుసుకోవాలని వివరిస్తున్నారు. ఒక డైట్‌ను ఫాలో అవుతున్నాం అంటే దాని వల్ల కలిగే లాభాలతో పాటు నష్టాలను కూడా తప్పకుండా తెలుసుకోవాలని చెప్తున్నారు. కీటో జెనిక్ డైట్‌ను కీటో డైట్ అంటారు. దీనిని తక్కువ కార్బ్‌డైట్, తక్కువ కార్డ్ హై ఫ్యాట్ డైట్ అని కూడా పిలుస్తారు. దీని మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉండవు. కొంచెం కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, అత్యధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి.

కీటో డైట్..

కీటో డైట్ అనే థీరిపై శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు డాక్టర్ ఈతాన్ వీస్ సందేహాన్ని వ్యక్తం చేశారు. తాను స్వయంగా ఈ కీటో డైట్‌ను ఫాలో అయ్యానని అన్నారు. చాలా మంది పరిశోధకులు అల్పాహారం తినకుండా సలాడ్‌లు, గింజలు, చీజ్, కాల్చిన కూరగాయలు, చేపలు, డార్క్ చాక్లెట్లను తింటారు. కీటో డైట్ తీసుకుంటే అనవసరమైన ఖర్చు తప్ప మరేమీ ఉండదని అన్నారు. అంతేకాకుండా కీటో డైట్‌లోని ఆహారం దీర్ఘకాలంలో హాని చేస్తుందని వివరించారు. అయినా దీనినే ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం కీటో వియాన్ ఆఫ్ డైట్‌ను అనుసరించవచ్చు అని చెప్పారు.

జీఎం డైట్..

ఏడు రోజుల్లో ఏడు కిలోల బరువు తగ్గించే డైట్ ప్లానే జీఎం డైట్ ప్లాన్. ఇందులో వారంలోని ఏడు రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో ఆహారం చొప్పున తీసుకుంటారు. జీఎం డైట్ ప్లాన్లో ఎక్కువగా శరీరాన్ని డిటాక్సిఫికేషన్ (నిర్విషీకరణ) చేసే ఆహారాలు ఉంటాయి. ఈ డైట్ ప్లాన్‌ని అనుసరించడం ద్వారా బరువు వేగంగా తగ్గుతారట. అయితే ఇది తక్కువ వ్యవధిలో మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత ఈ డైట్ ప్లాన్ ఆపేయగానే మళ్లీ బరువు పెరగడం మొదలవుతుందని పరిశోధకులు అంటున్నారు.

అట్కిన్స్ డైట్ ..

అట్కిన్స్ ఆహారంలో బరువు తగ్గడానికి, కార్బోహైడ్రేట్ల పరిమాణం పరిమితంగా ఉంటుంది. మరోవైపు మీకు కావలసినంత ఎక్కువ ప్రోటీన్, కొవ్వు లభించదు. ఈ డైట్ విషయంలో శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చే పోషకాలు అందవు. కాబట్టి దీనివల్ల ఆరోగ్యానికి అంత సేఫ్ కాదని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

Read Also: వీటిని తరచూ తింటే ఆరోగ్యంగా ఉంటారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>