రేపు వరంగల్‌కు పవన్ కల్యాణ్.. ఆ చిన్నారి కోసం!

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేపు (బుధవారం) తెలంగాణలోని వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు ప్రస్తుతం ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తనను కలవాలనేది ఆ బాలుడి చివరి కోరిక అని తెలుసుకున్న పవన్ వెంటనే స్పందించాడు. స్వయంగా బాలుడి ఇంటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా హనుమకొండలోని నిరంజన్ నివాసానికి చేరుకుని, బాలుడిని పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వరంగల్‌కు పవన్ కళ్యాణ్ వస్తుండటంతో స్థానిక జనసేన శ్రేణులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>