Mobile Popup Ad
Mobile Popup Ad

భూపాలపల్లిలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. 5 మంది అరెస్ట్

కలం, భూపాలపల్లి: భూపాలపల్లి (Bhupalpally) జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ ప్రాంతంలో పోలీసులు దాడులు చేశాయి. ఈ దాడుల్లో గంజాయి సేవిస్తున్న గడ్డిగానిపల్లికి చెందిన సెగ్గం సాయి వర్ధన్, సెగ్గంపల్లికి చెందిన దాసరి వంశీ, దుర్గం మహార్షిలను సీసీ ఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో గంజాయి సరఫరా చేస్తున్న ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం, రొయ్యూరు గ్రామానికి చెందిన జాడి మనోజ్, దుర్గం కిరణ్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుండి మొత్తం 210 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు నిమిత్తం భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని, గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>