కలం, వెబ్ డెస్క్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మంగళవారం హైదరాబాద్ లో ధర్నా (ABVP Protest) చేపట్టింది. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగింది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ “వద్దురా నాయనా కాంగ్రెస్ పాలనా” అంటూ ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లను మూసివేసే కుట్రను తక్షణమే ఉపసంహరించుకోవాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలన్నారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందని దుయ్యబట్టారు. కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో తరలించారు.

