Mobile Popup Ad
Mobile Popup Ad

కవిత మావోయిస్టు మాటలు ముమ్మాటికీ వాస్తవం: బండి సంజయ్

కలం, వెబ్ డెస్క్: తమ పార్టీలో మావోయిస్టు భావజాలం ఉన్నవారు ఉన్నారన్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. టీఆర్ఎస్ లో మావోయిస్టు భావజాలం ఉన్న నాయకులు ఉన్నారని కవిత చెప్పిన మాటలు ముమ్మాటికీ వాస్తవమని పేర్కొన్నారు. సమాజంలో అలాంటి వారు ఉన్నత స్థానంలో ఉండటంవల్లే సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. తుపాకీ గొట్టం ద్వారా అమాయకులను చంపి సాధించినదేమిటి? అని ప్రశ్నించారు. అమాయకుల ప్రాణాలు కోల్పోయారని.. అభం శుభం తెలియన మైనర్ పిల్లలు తుపాకీ పట్టి చనిపోయారని అన్నారు. చివరకు మావోయిస్టు పార్టీయే అంతమైపోయిందని అన్నారు.

తుపాకీతో సాధించేదేమీ లేదని గుర్తించి మావోయిస్టు అగ్ర నేతలు ప్రభుత్వం వద్ద లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోయారని బండి సంజయ్ గుర్తు చేశారు. మావోయిస్టు భావజాలం ఉన్న నేతలు కూడా ఆ భావజాలాన్ని వీడి అభివృద్ధికి సహకరించాలని కోరారు. లేనిపక్షంలో వాళ్ల భవిష్యత్తుకే ఇబ్బందిగా పరిణమిస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు. అడ్డుకునే భావనే ఉంటే తెలంగాణకు ఇంత పెద్ద ఎత్తున నిధులు, ప్రాజెక్టులు ఎందుకు వస్తాయి? అని ప్రశ్నించారు. ఒక్క మెట్రోనే అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డికి ఏముంది? అని అన్నారు. అసత్య ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదని చెప్పారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల అభివృద్ధికి కట్టుబడి రూ.వేల కోట్లు నిధులిస్తున్నామని చెప్పారు. ప్రజలు బీజేపీ నిబద్దతను గుర్తిస్తున్నారని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>