కలం, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌లోని (Pakistan) లాహోర్ కోటలో ఉన్న లవుని ఆలయాన్ని (Loh Temple) పాక్ ప్రభుత్వం మంగళవారం తిరిగి తెరిచింది. పురాతనమైన ఈ ఆలయం సరైన నిర్వహణ లేక పాడుబడడంతో కొంతకాలం కిందట పునరుద్ధరణ పనుల కోసం మూసివేసింది. ప్రస్తుతం పనులన్నీ పూర్తవడంతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీనితోపాటు సిక్కు యుగానికి చెందిన హమ్మామ్ కట్టడం, మహారాజా రంజిత్ సింగ్‌కు చెందిన అత్ దారా ప్రాంగణాన్ని కూడా పున:ప్రారంభించారు. లవ ఆలయంతోపాటు ఈ కట్టడాలను పాక్ ప్రభుత్వంతో కలసి ఆఘా ఖాన్ కల్చరల్ సొసైటీ పునరుద్ధరించింది.
శ్రీరాముని పుత్రులయిన లవకుశుల్లో ఒకరైన లవుడు లాహోర్‌ను నిర్మించినట్లు చెపుతారు. అందుకే ఆయన పేరు మీదుగా ఈ సిటీకి లాహోర్ అనే పేరు వచ్చిందని హిందువుల నమ్మకం. దీనికి నిదర్శనంగా చెప్పే వాటిలో లవుని ఆలయం ఒకటి. ఇది లాహోర్ కోట లోపల, నాలుగు చిన్న ద్వారాలున్న గర్బగుడిలా ఉంటుంది. కాలక్రమంలో ఈ గుడి పేరు లోహ్ టెంపుల్‌గా (Loh Temple) మారింది. కాగా, లాహోర్ కోట (Lahore Fort) సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ ఈ నగరంలోని అనేక హిందూ ఆలయాలు, కట్టడాలు, స్మారక చిహ్నాలు పరిరక్షిస్తోంది.
Read Also: హార్ట్ టచింగ్ వీడియో.. యజమాని మృతి, 4 రోజులు కాపలా కాసిన కుక్క!
Follow Us On: Pinterest


