Mobile Popup Ad
Mobile Popup Ad

చమురు సంక్షోభం.. ఆ దేశంలో స్మార్ట్ లాక్ డౌన్ !

కలం, వెబ్​ డెస్క్​ : ఇరాన్ యుద్ధ మేఘాలు పాకిస్థాన్‌ (Pakistan)ను చమురు సంక్షోభంలోకి నెట్టాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేతతో విదేశాల నుంచి ముడి చమురు సరఫరా నిలిచిపోవడంతో దేశంలో ఇంధన నిల్వలు అడుగంటాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశంలోని మార్కెట్లు, సాధారణ దుకాణాలు, డిపార్ట్‌మెంటల్ స్టోర్లను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ ఔట్‌లెట్లకు రాత్రి 10 గంటల వరకు అనుమతి ఇచ్చారు. విలాసవంతమైన వేడుకలు, పెళ్లిళ్లపై కూడా కఠిన ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా పెళ్లి వేడుకలు నిర్వహించుకోవాలనుకుంటే, కేవలం అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో ఇళ్లలోనే ముగించుకోవాలని తెలిపారు. అయితే అత్యవసర సేవలను పరిగణనలోకి తీసుకుని మెడికల్ స్టోర్లు, ఫార్మసీలకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించారు.

Read Also: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>