Mobile Popup Ad
Mobile Popup Ad

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

కలం, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వివాదంలో చిక్కుకున్నాడు. డ్రంగ్ అండ్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్ (David Warner) ను సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గత రాత్రి సిడ్నీలోని మారుబ్రాం ప్రాంతంలో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో కారు నడుపుతున్న వార్నర్ కు బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించగా.. వార్నర్ శరీరంలో ఆల్కహాల్ శాతం 0.104గా నమోదైంది. ఇది చట్టబద్ధమైన పరిమితి (0.05) కంటే రెండింతలు ఎక్కువగా నమోదైంది. దీంతో పోలీసులు వార్నర్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆయన్ని వ్యక్తిగత షూరిటీపై విడుదల చేసి.. 2026, మే 7న సిడ్నీలోని సెంటర్ లోకల్ కోర్టులో హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

PSL టోర్నీ నుంచి వార్నర్ ఔట్..?

ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL 2026) లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వార్నర్.. మ్యాచ్ ల మధ్య కొద్ది రోజుల విరామం దొరకడంతో తన స్వస్థలమైన సిడ్నీకి వెళ్లారు. వార్నర్ (David Warner) నాయకత్వంలోని కరాచీ కింగ్స్ జట్టు ఆడిన 3 మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. ఏప్రిల్ 9న పెషావర్ జల్మీతో జరగనున్న తదుపరి మ్యాచ్ సమయానికి వార్నర్ పాకిస్థాన్ చేరుకోవాల్సి ఉండగా ఈ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. అతను పాకిస్థాన్ వెళ్లేందుకు న్యాయపరమైన చిక్కులు ఉండడంతో.. డేవిడ్ వార్నర్ ఈ మెగా టోర్నీ నుంచి పూర్తిగా వైదొలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వార్నర్ కెరీర్ కు పొంచి ఉన్న ప్రమాదం..!

ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా పేరు గాంచిన డేవిడ్ వార్నర్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. పలు దేశా లీక్ క్రికట్ లో ఆడుతూ రాణిస్తున్నాడు. గత బిగ్ బాష్ లీగ్ సీజ్ సీజన్ లో సిడ్నీ థండర్ జట్టు తరుఫున 8 మ్యాచ్ ల్లో 433 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. వచ్చే సీజన్ లో 40వ ఏటా అడుగుపెడుతున్నప్పటికీ, తాను ఇంకా క్రికెట్ ఆడతానని ఈ 39 ఏళ్ల క్రికెటర్ ప్రకటన చేశారు. అయితే ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో లో పట్టుబడం వార్నర్ కెరీర్ పై ఎలంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ వార్నర్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Read Also: పంజాబీ నటి ప్రేమలో భారత క్రికెటర్‌ అర్షదీప్ సింగ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>