కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల రక్షణ కోసం నెల రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్- XII (Operation Smile) అద్భుతమైన ఫలితాలను సాధించింది. మహిళా భద్రత విభాగం ఏడీజీపీ చారుసిన్హా ఐపీఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం, గత నెల రోజులుగా సాగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 5,582 మంది చిన్నారులకు విముక్తి లభించింది.
అత్యధికంగా 4,978 మంది చిన్నారులను క్షేమంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడం విశేషం. ఇక ఆశ్రయం లేని మరో 604 మంది చిన్నారులను సురక్షితమైన రక్షణ గృహాలకు తరలించి, వారికి అవసరమైన వసతి, సంరక్షణ కల్పించారు.


