కలం, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ ఎమ్మెల్యే MS.రాజు (MS Raju) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడి (CM Chandrababu Naidu)పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. శనివారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, అంబటి రాంబాబు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొడతామని ఆయన హెచ్చరించారు. తమకు చంద్రబాబు లాగా సహనం, ఓపీక లేవన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక చేరేస్తాం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబును వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే (MS Raju) డిమాండ్ చేశారు.
ఫ్లెక్సీ విషయంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును బూతులు తిట్టారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరులోని అంబటి ఇంటిపై దాడి చేశారు. కార్లు, ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. రాంబాబు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీడీపీ మద్దతుదారులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళనలు చేస్తున్నారు.


