epaper
Friday, January 23, 2026
spot_img
epaper

రిపబ్లిక్ డే పరేడ్ లో ‘ఆపరేషన్ సిందూర్’ శకటం..

కలం, వెబ్ డెస్క్ : జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో (Republic Day parade) ఈ సారి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) శకటాన్ని పరేడ్ లో ప్రదర్శించబోతోంది సైన్యం. ఆపరేషన్ సిందూర్ లో భారత్ సాధించిన విజయాన్ని ప్రతిబింబించేలా త్రి-సైన్యాల సమర్థతను ఇందులో ప్రదర్శిస్తారు. ఆపరేషన్ సిందూర్ శకటంలో బ్రహ్మోస్ వినియోగాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రదర్శించబోతున్నామని ఎయిర్ కమోడర్ మనీష్ సభర్వాల్ తెలిపారు. పాకిస్థాన్ స్థావరాల్లో ఒకదాన్ని ఈ బ్రహ్మోస్ నాశనం చేసిందని.. S-400 లాంటి వాయు రక్షణ వ్యవస్థలను కూడా ప్రదర్శిస్తామని తెలిపారు. భారత త్రి-సైన్యం కలిసి పోరాడితే అద్భుత విజయం ఖాయం అనే సంకేతాన్ని ఈ శకటం ద్వారా తెలియజేస్తున్నట్టు మనీష్ సభర్వాల్ చెప్పారు.

ఈ శకటం ప్రారంభంలో భారత నౌకాదళం రక్షణ వ్యవస్థను ప్రదర్శించనున్నారు. ఇది సముద్రాధిపత్యాన్ని ఎలా కొనసాగిస్తుందో చూపించబోతున్నారు. శకటం మధ్యలో ఆపరేషన్ సిందూర్  జరిగిన తీరును ఆవిష్కరించబోతున్నారు. ఆ తర్వాత SCALP క్షిపణులతో అమర్చిన రఫేల్ విమనాం ఎలా సర్టికల్ స్ట్రైక్స్ చేసిందో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను ఉంచి ఆ తర్వాత SU-30 MKI పనితీరును చూపించబోతున్నారు. దీని తర్వాత ఆపరేషన్ సిందూర్ లో అత్యంత కీలకంగా వ్యవహరించిన S-400 సిస్టమ్ సమర్థతను ప్రదర్శించనున్నారు. ఇది 350 కిలోమీటర్ల దూరంలోనే శత్రువును ఎలా బ్లాస్ట్ చేస్తుందో వేడుకల్లో (Republic Day parade) ప్రదర్శిస్తారు. ఇలా ఆపరేషన్ సిందూర్ లో వాడిన అన్ని రకాల వెపన్స్ ను ఇందులో ప్రదర్శించబోతున్నారు.

Read Also: గవర్నర్‌ అవార్డ్స్‌కు ఎంపికైంది వీరే

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>