మావోయిస్టుల డంప్‌లో కిలో బంగారం.. రూ. 3.61 కోట్ల క్యాష్

కలం, వెబ్ డెస్క్: మావోయిస్టుల డంప్‌లో (Maoists Gold Dump)  పోలీసులు భారీగా బంగారం, నగదు సీజ్ చేశారు. ఇటీవల ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పుర్‌లో108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిపై రూ.3.29 కోట్ల రివార్డు ఉంది. కాగా మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా భారీగా బంగారం, నగదు పట్టుబడింది. కిలో బంగారం, రూ. 3.61 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల మీద రూ.3.29 కోట్ల  రివార్డు ఉండగా అంతకు మించి బంగారం, నగదు పోలీసులు సీజ్ చేసుకోవడం గమనార్హం. భద్రతా బలగాలు AK-47, INSAS, LMG, BGL వంటి 101 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఇవే..

AK-47 : 6
AK-47 TAR: 1
INSAS రైఫిళ్లు: 10
కార్బైన్: 1
SLR రైఫళ్లు: 5
7.62 మిమీ LMG: 1
5.56 మిమీ LMG: 2
303 మిమీ LMG: 1
303 రైఫిళ్లు: 20
12 బోర్ రైఫళ్లు: 25
BGL లాంచర్లు: 11
51 మిమీ మోర్టార్: 1
315 బోర్ రైఫళ్లు: 3
మజల్ లోడింగ్ రైఫళ్లు: 13
మెగా BGL: 1

Read Also: మెదక్​ మహిళా మర్డర్ కేసులో బిగ్​ ట్విస్ట్​.. అసలు విషయం అదే!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>