కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్‌లో నుమాయిష్ (Nizamabad Numaish) ఆకట్టుకుంటోంది. సంక్రాంతి పండుగ, రానున్న సమ్మర్ సీజన్ దృష్టిలో పెట్టుకొని డిస్నీ ల్యాండ్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. కొత్త నిర్మాణాలు, కళాత్మక సెట్టింగ్స్ నుమాయిష్‌కు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. నుమాయిష్ ఎంట్రన్స్‌లో ప్రత్యేకమైన విమాన సెటప్ ఉంది. అందులో ఎడమవైపు నుంచి లోపలికి వెళ్లి వెనకవైపు ఎగ్జిబిషన్‌లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు.
లోపలికి అడుగుపెట్టగానే ఫారెస్ట్ థీమ్ సెటప్ ఆకట్టుకుంటుంది. అందులోని భారీ ఏనుగులు సింహాలు, పులులు బొమ్మలు ఇట్టే అట్రాక్ట్ చేస్తాయి. వాటర్ ఫాల్, చిల్డ్రన్ జోన్ షాపింగ్స్ ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు నుమాయిష్ (Numaish)కు వస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సెట్టింగ్స్ వద్ద సెల్ఫీలు దిగుతూ మైమరిచిపోతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో నుమాయిష్‌లో సందడి నెలకొంది.

Read Also: కళ్ల ముందే మదర్ డెయిరీ కొలాప్స్!
Follow Us On: Youtube


