కలం, వెబ్ డెస్క్: చలికాలంలో (Winter Season) ఆహారపు అలవాట్లు తరచుగా మారుతూ ఉంటాయి. ఒంటికి వెచ్చదనాన్ని ఇచ్చే ఫుడ్ ఐటమ్స్ తినడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతుంటారు. చలికాలంలో బాదం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. బాదం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. జీవక్రియ పనితీరుకు బాగా పనిచేస్తుంది. దీనిలోని విటమిన్ E ఉండటంతో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కణాలను కపాడుతుంది. చలికాలంలో సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. క్రమం తప్పకుండా బాదం తింటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. బాదం (Almonds) పప్పులో ఉండే డైటరీ ఫైబర్ పేగు కదలికలకు బాగా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. బాదంలోని ఆరోగ్యకరమైన కొవ్వులు నీరసాన్ని దూరం చేస్తాయి. చాలామంది బరువు సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివారు నిత్యం బాదం తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఉండటంతో తక్షణ శక్తినిస్తాయి. అలాగే మెదుడు ఆరోగ్యానికి కాపాడుతూ చురుగ్గా ఉంచేలా చేస్తుంది.


