కలం వెబ్ డెస్క్ : తమిళనాడులో (Tamil Nadu) పొంగల్ పండుగను పురస్కరించుకుని ఏటా నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టు (Jallikattu) ఘనంగా ప్రారంభమైంది. మధురై, అవనియాపురం తదితర ప్రాంతాల్లో జల్లికట్టు భారీ ఎత్తున నిర్వహిస్తారు. జల్లికట్టు ప్రారంభానికి ముందే భద్రత, వైద్య ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టంగా చేపట్టారు. వాడివాసల్‌లోకి ఎద్దులు ప్రవేశించే ముందు పశువైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్న ఎద్దులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసి పోటీలకు అనుమతించారు. ఈ తనిఖీలు ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమైనట్లు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ నందగోపాల్ తెలిపారు.
సుమారు 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జల్లికట్టుకు (Jallikattu) 500 ఎద్దులకే అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎద్దుల యజమానులు సహకరించారని అధికారులు కోరారు. జల్లికట్టు సందర్భంగా యువకులు గాయపడితే తక్షణ చికిత్స కోసం అంబులెన్సులు, సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్యులు సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో పెద్ద ఆసుపత్రులకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అవనియాపురంలో ఈ రోజు సుమారు 1,200 ఎద్దులు జల్లికట్టులో పాల్గొంటాయని అధికారులు తెలిపారు.
Read Also: బంగారం ధరను ఎలా లెక్కకట్టాలో అర్థం కావట్లేదా.. అయితే ఇది మీకోసమే..
Follow Us On: Pinterest


