కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో యూరియా కొరత (Urea Shortage) లేదని, యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి కోరారు. ఎరువుల పంపిణీ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో 1,29,824 మంది రైతులు 3,55,795 బస్తాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
మండలం యూనిట్‌గా జిల్లాలోని అన్ని మండలాలకు కూడా ఈ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా శాస్త్రీయంగా పంటలకు నత్రజని అందించే విధంగా ఈ యాప్ ను రూపొందించినట్లు పేర్కొన్నారు.
యాప్ విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే రైతు సోదరులందరూ వ్యవసాయ విస్తీర్ణాధికారిని లేదా మండల వ్యవసాయ అధికారిని, సొసైటీలకు సంబంధించిన అధికారులను, వాలంటీర్లను సంప్రదించి యూరియా బుకింగ్ చేయించుకోవాలని సూచించారు. యూరియా దొరకదని (Urea Shortage) రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పంటలకు సరిపడా యూరియాను అందించే బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంటుందని భరోసా కల్పించారు.
Read Also: రాష్ట్రంపై కిషన్‌రెడ్డి కుట్రలు : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
Follow Us On: Instagram

