మెదక్ జిల్లాలో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

కలం మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మెదక్ మండల పరిధిలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పుష్పాల వాగు వద్ద మట్టి రోడ్డు కుంగిపోయింది. ఈ క్రమంలో సెయింట్ డాన్ బాస్కో పాఠశాలకు చెందిన బస్సు 32 మంది విద్యార్థులతో వస్తుండగా.. పుష్పాల వాగు వద్దకు చేరుకోగానే మట్టి రోడ్డు కుంగిపోయింది. తక్షణమే గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయడంతో ఒక మూలన చేరి ఆగిపోయింది. వెంటనే డ్రైవర్ విద్యార్థులను బస్సు కిందకు దించడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్ బ్రేకులు వేయకపోయి ఉంటే, పుష్పాల వాగులో పడిపోయేదని.. ఆయన అప్రమత్తతే పిల్లల ప్రాణాలను కాపాడిందని స్థానికులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>