కలం, వనపర్తి: జిల్లా (Wanaparthy) లో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ సునితారెడ్డి తెలిపారు. ముందస్తు పోలీసు అనుమతి లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, ఊరేగింపులు, భారీ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజల సాధారణ జీవనానికి అంతరాయం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ సంస్థ, సంఘం లేదా వ్యక్తి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే సంబంధిత పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు. చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజల సహకారంతోనే జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని మరింత బలోపేతం చేయగలమని ఎస్పీ పేర్కొన్నారు

