Mobile Popup Ad
Mobile Popup Ad

పుష్ప స్టైల్‌లో బస్సు ఆపిన యువకుడు.. వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాంగ్ సైడ్‌లో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సును ఓ యువకుడు ధైర్యంగా అడ్డుకుని నిలిపివేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, బస్సు తప్పు దారిలో వస్తుండగా ఒక వ్యక్తి రోడ్డుమధ్యలో నిలబడి దాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా, ఆ యువకుడు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనను చూసిన వారు ‘పుష్ప స్టైల్’ (Pushpa Style) అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  నటించిన పుష్ప సినిమాలోని డైలాగ్‌ను గుర్తు చేస్తూ “పుష్ప.. తగ్గేదే లే ” అంటూ  నెటిజన్లు స్పందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>