కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Airport)లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం, లోపిస్తున్న దృశ్యమానత కారణంగా రన్‌వేపై విమానాలను ల్యాండ్ చేయడానికి పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు.
ముంబయి, దిల్లీ, బెంగళూరు, వారణాసి, సింగపూర్ వంటి నగరాల నుంచి హైదరాబాద్ వస్తున్న మొత్తం 9 విమానాలను అధికారులు ఇతర ప్రాంతాలకు దారి మళ్లించారు. ఆకస్మికంగా విమానాలు దారి మళ్లడం, సర్వీసుల్లో జాప్యం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాతావరణం మెరుగుపడే వరకు కొన్ని విమానాలకు ల్యాండింగ్ అనుమతులను తాత్కాలికంగా నిరాకరించినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.
Read Also: నిమ్స్ వైద్య చికిత్సకు MLA ధన్ పాల్ ఎల్వోసీ అందజేత
Follow Us On: X(Twitter)

