కలం, నిజామాబాద్ బ్యూరో: వన్యప్రాణి సంరక్షణతో (Wildlife Rescue) పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా, నిజామాబాద్ (Nizamabad) జిల్లా నందిపేట్ DYRO ఆధ్వర్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ వల్ల పర్యావరణ వ్యవస్థపై కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలకు ప్లాస్టిక్ వ్యర్థాలు పక్షులు, వన్యప్రాణులు, నీటి వనరులు, జీవ వైవిధ్యంపై కలిగించే హానికర ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. నడుకుడ గ్రామ సర్పంచ్ తో పాటు స్థానిక ప్రజలు కూడా కార్యక్రమంలో పాల్గొని SRSP బ్యాక్ వాటర్స్ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు SRSP బ్యాక్‌వాటర్స్ ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా పరిరక్షించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించి, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అదేవిధంగా, అడవి కుక్కల దాడిలో గాయపడిన ఒక చిత్తల జింక (Spotted Deer) గురించి సమాచారం అందిన వెంటనే నందిపేట్ DYRO అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జింకను రక్షించారు. అనంతరం వెటర్నరీ వైద్య సిబ్బంది ద్వారా జింకకు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రథమ చికిత్స అందించారు. పై అధికారుల ఆదేశాల మేరకు జింక భద్రత, ఆహారం, నీటి సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని, ఆ జింకను అరణ్య అర్బన్ పార్క్‌కు తరలించి, పార్కులోని సోలార్ పాయింట్ ప్రాంతంలో సురక్షితంగా విడిచి పెట్టారు. వన్యప్రాణి సంరక్షణ (Wildlife Rescue), జీవవైవిధ్య పరిరక్షణ పర్యావరణ పరిరక్షణలో అటవీ శాఖ నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ విక్రమ్ సింగ్ తెలిపారు.
Read Also: హైడ్రా ‘ఈగల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లు..!
Follow Us On : WhatsApp

