కలం, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం అరటిపండు తిని, దాని తొక్కను పనికిరాని చెత్తగా భావించి పారేస్తుంటాం. కానీ, ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన సౌందర్య సాధనాలలో అరటి తొక్క (Banana Peel) కూడా ఒకటి అన్న విషయం చాలామందికి తెలియదు. అరటిపండు రుచికి, ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు చర్మ నిపుణులు. అరటి తొక్కలో చర్మానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయట. అవేంటో తెలుసుకుందామా?
అరటిపండు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ముఖంపై అరటిపండు తొక్కతో మసాజ్ చేయడం వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇది చర్మంపై ముడతలను నివారించి, వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుందట. మొటిమలు, మచ్చల సమస్యతో బాధపడేవారికి ఇది ఒక మంచి సహజ నివారణిగా పనిచేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో చర్మంపై వచ్చే మంట, ఎరుపుదనాన్ని తగ్గించి చర్మాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది.
ముడతల నివారణ (Anti-Aging)
వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు రావడం సహజం. అయితే అరటిపండు తొక్కతో (Banana Peel) ముఖాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు, సన్నని గీతలు క్రమంగా తగ్గుతాయట. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చి యవ్వనంగా కనిపించేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
మొటిమల నుండి ఉపశమనం (Acne & Pimples)
టీనేజ్ వయస్సులో ప్రతిఒక్కరిని బాధించే మరో సమస్య మొటివమలు. ఈ మొటిమలు, మచ్చల సమస్యతో బాధపడేవారికి అరటి తొక్క ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ రంధ్రాల్లోని బ్యాక్టీరియాను తొలగించి, మొటిమలు త్వరగా తగ్గేలా చేస్తాయని సూచిస్తున్నారు.
వేసవి చర్మ సమస్యలకు చెక్ (Soothes Skin Irritation)
చాలామందికి వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల చర్మంపై మంట, దురద లేదా ఎరుపుదనం వంటి సమస్యలు ఎదురవుతాయి. అటువంటప్పుడు అరటి తొక్కను ముఖంపై రుద్దడం వల్ల చర్మం చల్లబడి, ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
అరటిపండు తొక్కను నేరుగా ముఖంపై వృత్తాకారంలో కొద్ది నిమిషాల పాటు మసాజ్ చేసి, ఆపై చల్లటి నీటితో కడిగేసుకోవాలి. అరటి తొక్కలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మానికి లోతైన పోషణను అందిస్తాయి. ఇది చర్మంపై ఉన్న ట్యాన్ (నలుపుదనం) మరియు డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి, ముఖానికి సహజమైన కాంతిని, గ్లోను తీసుకువస్తుంది. అయితే, ప్రతి ఒక్కరి చర్మ తత్వం వేరుగా ఉంటుంది. కాబట్టి చర్మ సంరక్షణలో ఏదైనా కొత్త మార్పు చేసే ముందు నాలెడ్జ్ కోసం ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం లేదా చర్మ నిపుణుల (Dermatologist) సలహా తీసుకోవడం ఉత్తమం.
Read Also: ప్రేయసిని కలవడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఫిట్‌నెస్ ట్రైనర్
Follow Us On : WhatsApp

