కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాశెట్టి శ్రీనివాస్ కుమారుడు శ్రేయస్ కృష్ణ ఎంబీబీఎస్ శిక్షణ పూర్తి చేశారు. ఈ సందర్భంగా శ్రేయస్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య (Nizamabad CP Sai Chaitanya) అభినందించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగుల పిల్లలు ఉన్నత చదువులు చదివి, సమాజానికి ఉపయోగపడే వృత్తుల్లో స్థిరపడటం గర్వకారణమన్నారు. కష్టపడి చదివి డాక్టరుగా ఎదిగిన శ్రేయస్ కృష్ణ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది పిల్లల చదువులకు తమ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీపీ భరోసా ఇచ్చారు.
Read Also: కాంగ్రెస్‌లో కుంపటి.. ఎంపీ అరవింద్ కామెంట్లతో కొత్త చర్చ !
Follow Us On: WhatsApp

